సత్తెనపల్లి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. యువకుడిపై దాడిని ఖండించారు. పోలీసులు సంయమనం పాటించాలని కోరారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రజల మధ్య పరస్పర సమన్వయం ఉండాలని ఆకాంక్షించారు. పోలీసులు దురుసుగా వ్యవహరించరాదన్న చంద్రబాబు... ప్రజలు వారికి సహకరించాలని కోరారు. విపత్కర సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావం ముఖ్యమన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... లాక్డౌన్: లాఠీ దెబ్బలకు వ్యక్తి మృతి