Sarpanch Ward Member Election in AP: రాష్ట్రవ్యాప్తంగా 34 సర్పంచ్‌లు, 245 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం కొలవలిలో సర్పంచ్(Sarpanches) స్థానానికి పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగింది. గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనకుండా 144 సెక్షన్ అమలు చేశారు. కొత్తపల్లె, తాళ్ళమాపురం పంచాయతీల్లో ఒక్కో వార్డు స్థానానికి ఉప ఎన్నిక కొనసాగుతోంది. కొత్తపల్లెలో అధికార పార్టీ మద్దతుదారులో వర్గ విభేదాలతో వేర్వేరుగా ఎన్నికల బరిలో నిలిచారు. అనంతపురం జిల్లా యాడికి పంచాయతీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనాలు బారులు తీరారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎర్రమాడులో పోలీసులు వృద్ధులను తమ చేతులపై ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోనికి తరలించారు. వీరులపాడు మండలం దాచవరంలో ఓటేసేందుకు బయలుదేరిన 93 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన బండ్లమూడి వీరయ్య పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా తుదిశ్వాస విడిచారు.
బాపట్ల జిల్లాలో పంచాయితీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంకొల్లు మండలం పావులూరు పచాయితి సర్పంచ్ పదవికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన వివాదాలు నేపద్యంలో ఇంకొల్లు సి.ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పలు పంచాయతీలకు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
Volunteers Participated in Sarpanch Election "మరీ ఇంత బరితెగింపా?"..సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్లు
ఇరగవరం మండలం కావలిపురం పంచాయతీ సర్పంచి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో వదిన మరుదులు బరిలో నిలిచారు. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికార పార్టీకి చెందిన అధికార పార్టీ వైసీపీ ఒక అభ్యర్థిని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరో అభ్యర్థిని బలపరుస్తూ పోటీలో నిలిపాయి. గ్రామంలో 2200 ఓటర్లు ఉండగా ఓటింగ్ సమయం ముగిసేసరికి 19 వందల నుంచి 2000 వరకు పోల్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరు అభ్యర్థులు తరపున ఒక్కొక్కరు ఓటుకు 1000 రూపాయలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
తణుకు మండలం తేతలి గ్రామంలో ఎనిమిదో వార్డు ఉపఎన్నిక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు భారీగానే నగదు ఇతర బహుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు బీజేపీ ఫస్ట్ లిస్ట్.. సీఎం బఘేల్‌పై దుర్గ్ ఎంపీ పోటీ