ETV Bharat / state

ఎంపీటీసీ ఎన్నికల బరిలో సర్పంచి

గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం సర్పంచి.. ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. గతేడాది మార్చిలో శివాజీ ఎంపీటీసీ అభ్యర్థిగా వైకాపా తరఫున నామినేషన్‌ దాఖలు చేయగా.. అధికారులు అతని నామినేషన్‌ ఆమోదించారు. కానీ, ఎన్నికలు వాయిదా పడటంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సర్పంచిగా ఉన్న శివాజీ ఎంపీటీసీ సభ్యునిగానూ గెలిస్తే.. రెండు పదవుల్లో ఒకదానికి రాజీనామా చేయాల్సి ఉంటుందని.. ఎంపీడీవో సువార్త తెలిపారు.

parishad elections
ఎంపీటీసీ ఎన్నికల బరిలో సర్పంచి
author img

By

Published : Apr 6, 2021, 7:11 AM IST

సర్పంచే ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంఘటన ఇది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగడిపాలెం సర్పంచి తిరుమలశెట్టి శివాజీ ప్రస్తుత పరిషత్‌ ఎన్నికల్లోనూ పోటీలో ఉన్నారు. గతేడాది మార్చిలో ఆయన ఎంపీటీసీ అభ్యర్థిగా వైకాపా తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. నామపత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం అధికారులు అతని నామినేషన్‌ ఆమోదించారు. కరోనా నేపథ్యంలో అప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో శివాజీ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. దీనిపై ఎంపీడీవో సువార్త మాట్లాడుతూ సర్పంచిగా ఉన్న శివాజీ ఎంపీటీసీ సభ్యునిగానూ గెలిస్తే రెండు పదవుల్లో ఒకదానికి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. రాజీనామా చేసిన స్థానానికి ఎన్నికల సంఘం అనుమతి మేరకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: తిరుపతిలో వాడీవేడిగా పార్టీల ప్రచారాస్త్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.