గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల పోలింగ్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డ్యూటీలో ఉన్న ఆర్ఎస్సై.. ఆకారణంగా లాఠీతో తనను కొట్టారని వైకాపా మద్దతుదారుడు, సర్పంచ్ అభ్యర్థి ఖుషి బాణావత్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను ఎస్టీ అని చెప్పినా వినకుండా పక్కకు నెట్టేశారని వాపోయారు. పార్టీ నేతలు వచ్చి నిరసనకారులను సముదాయించారు. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు చెప్పడంతో అక్కనుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: స్థానిక సమరం: మధ్యాహ్నం 12.30 వరకు పోలింగ్ శాతం 62.02