సంగం డెయిరీ ఛైర్మన్ల ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు..రాజకీయ కోణంలో జరిగిందే తప్ప సంస్థలో ఎలాంటి అక్రమాలు లేవని డైరక్టర్లు కంచర్ల శివరామయ్య, వలివేటి ధర్మారావు స్పష్టం చేశారు. 1978లో ప్రారంభమైన సంగం డెయిరీ.. పాడి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందన్నారు. 1995లో సహకార చట్టం అమల్లోకి వచ్చాక.. డెయిరీని ఆ పరిధిలోకి తెచ్చామన్నారు. 2010లో నరేంద్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారని.. 2013లో కంపెనీ చట్టం పరిధిలోకి మార్చారని వివరించారు. ఈ ప్రక్రియ అంతా..చట్ట ప్రకారమే జరిగిందని ఇందులో అవినీతి ఆస్కారం లేదన్నారు.
డెయిరీలో అక్రమాలు జరిగితే సహకార శాఖ తరపున విచారణ జరపాలే తప్ప ఏసీబీ కేసులు, అరెస్టులు ఏమిటని శివరామయ్య ప్రశ్నించారు. డెయిరీ ప్రతిష్టను దెబ్బతీయాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కంపెనీ చట్టంలోకి వెళ్తే వ్యాపారం వృద్ది జరిగి రైతులకు లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే మార్చినట్లు డైరక్టర్ ధర్మారావు తెలిపారు. దాని కోసం 2013లో ఉన్న పాలకమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి