ETV Bharat / state

సంగం డెయిరీలో ఎటువంటి అక్రమాలు జరగలేదు: కంపెనీ డైరెక్టర్లు - sangam dairy directors updates

34 ఏళ్లుగా పాడిరైతుల కోసం పని చేస్తున్న సంగం డెయిరీని దెబ్బతీసేందుకే.. ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని కంపెనీ డైరెక్టర్లు ఆరోపించారు. గుజరాత్​కు చెందిన అమూల్ కంపెనీకి లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.

sangam dairy directors
సంగం డెయిరీ డైరెక్టర్లు
author img

By

Published : Apr 24, 2021, 12:26 PM IST

ఏది నిజం... ఎవరు విచారణ చేపట్టాలి?

సంగం డెయిరీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడినందునే సంస్థ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రని అరెస్టు చేశాం. ఇదీ అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసిన ప్రకటన. అయితే ఇందులో నిజమెంత..? డెయిరీపై ఎవరైనా ఫిర్యాదు చేశారా...? అసలు జరిగిన అక్రమాలేంటి...? ఒకవేళ డెయిరీలో అక్రమాలు జరిగితే విచారణ జరపాల్సింది సహకార శాఖనా... అవినీతి నిరోధక శాఖనా..? ఇవీ సంగం డెయిరీ పాలక మండలి వేస్తున్న ప్రశ్నలు.

రాజకీయ కోణంలో జరిగిందే...

గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర.. అరెస్టు రాజకీయ కోణంలో జరిగిందేనంటున్నారు సంస్థ ప్రతినిధులు. డెయిరీ వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని డైరక్టర్లు కంచర్ల శివరామయ్య, వలివేటి ధర్మారావు స్పష్టం చేశారు. 1978లో ప్రారంభమైన సంగం డెయిరీ పాడి రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తోందన్నారు. 1995లో సహకార చట్టం అమల్లోకి వచ్చాక.. డెయిరీని ఆ పరిధిలోకి తెచ్చామన్నారు. 2010లో నరేంద్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారని.. 2013లో కంపెనీ చట్టం పరిధిలోకి మార్చారని వివరించారు. ఈ ప్రక్రియ అంతా చట్ట ప్రకారమే జరిగిందని.. దీంట్లో అవినీతి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

సంతకాలు ఫోర్జరీ జరిగిందని నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గంగా అభివర్ణించారు. డెయిరీలో అక్రమాలు జరిగితే సహకార శాఖ తరపున విచారణ జరపాలే తప్ప.. ఏసీబీ కేసులు, అరెస్టులు ఏమిటని శివరామయ్య ప్రశ్నించారు. సంగం డెయిరీ ప్రతిష్టను దెబ్బతీయాలని, సహకార డెయిరీలను నష్టపర్చాలని ముఖ్యమంత్రి యత్నిస్తున్నారని ఆరోపించారు. కంపెనీ చట్టంలోకి వెళ్తే వ్యాపారం వృద్ది జరిగి రైతులకు లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే మార్చినట్లు డైరక్టర్ ధర్మారావు తెలిపారు. దాని కోసం 2013లో ఉన్న పాలకమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వివరించారు. అప్పటి డైరక్టర్లు అందరూ సంతకాలు పెట్టారని వివరించారు.

1978లో ఏర్పాటు... 2010కి టర్నోవర్ 250 కోట్లు..

సంగం డెయిరీ 1978లో గుంటూరు జిల్లా వడ్లమూడి సమీపంలో ఏర్పాటైంది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులుగా యడ్లపాటి వెంకట్రావు ఉన్నారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మరికొందరు డైరక్టర్లుగా పనిచేశారు. మొదటి ఏడాది టర్నోవర్ 4కోట్ల రూపాయలు. 2008లో ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్ అయ్యారు. 2010లో సంస్థ టర్నోవర్ 250 కోట్లు. గతేడాది సంగం డెయిరీ టర్నోవర్ 913కోట్లు. ఇలా 4కోట్ల నుంచి దాదాపు వెయ్యి కోట్ల టర్నోవర్ స్థాయికి డెయిరి ఎదిగింది.

నరేంద్ర ఛైర్మన్ అయిన తర్వాత పాల ఉత్పత్తుల తయారీ పెంచారు. కేవలం పాలు, మజ్జిగ, నెయ్యి, వెన్న మాత్రమే కాకుండా స్వీట్లు, లస్సీ, బిస్కట్లు, బ్రెడ్, ఉలవచారు వంటివి తయారు చేస్తున్నారు. దీంతో సంస్థకు మరింత లాభాలు వచ్చాయి. ఇలా సంస్థ ఎదుగుతున్న వేళ ప్రభుత్వం ఏపీలోకి అమూల్ కంపెనీని ఆహ్వానించింది. గుంటూరు జిల్లాలోనూ అమూల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అమూల్​తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పటి నుంచే సంగం డెయిరీని దెబ్బతీసే చర్యలు మొదలయ్యాయని నరేంద్ర పలుమార్లు ఆరోపించారు. ఇపుడు ఏకంగా ఆయనను అరెస్టు చేశారు. నరేంద్ర అరెస్టుపై డెయిరీలో పనిచేసే కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పాడిరైతులకు నష్టం చేకూర్చే చర్యగా కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

కోర్టులో నడుస్తున్న కేసు...
సహకార డెయిరీని కంపెనీ చట్టం పరిధిలోకి మార్చటం పైనా ఆరుగురు రైతులు కోర్టుకు వెళ్లారు. ఆ కేసు కోర్టులో నడుస్తోంది... కానీ అనూహ్యంగా ఏసీబీ కేసు నమోదు కావటం, నరేంద్రను అరెస్టు చేయటం డెయిరీ వర్గాల్లో ఆందోళన నింపింది.

ఇదీ చదవండి: 'మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకవస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.