ETV Bharat / state

Sand Prices in AP: అక్రమార్కులకు ఇసు'కాసుల' పంట.. ప్రజల జేబులకు చిల్లు పెడుతూ అడ్డగోలుగా దోపిడీ.. - sand mining mafia in ap

Sand Prices in AP: కృష్ణానదిలో తవ్వకాల నిలిపివేతతో యార్డుల వద్దే.. ప్రభుత్వం ఖరారు చేసిన ధరల కన్నా అధికంగా విక్రయాలు జరుపుతూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రీచ్​లలో టన్ను ఇసుకను 800 రూపాయలకు విక్రయిస్తూ.. ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అధిక ధరలతో దోచుకుంటున్నా ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యం. పైగా.. అక్రమ తవ్వకాలు, అధిక ధరలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

Sand_Prices_in_AP
Sand_Prices_in_AP
author img

By

Published : Aug 22, 2023, 8:38 AM IST

Updated : Aug 22, 2023, 2:23 PM IST

Sand Prices in AP: అక్రమార్కులకు ఇసు'కాసుల' పంట.. ప్రజల జేబులకు చిల్లు పెడుతూ అడ్డగోలుగా దోపిడీ..

Sand Prices in AP: కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోవటం.. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం ఖరారు చేసిన ధరల కన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోని ఇసుక రీచ్​లలో టన్ను ఇసుక 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. నిర్ణయించిన ధరకే విక్రయించాలని ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అధిక ధరలతో అడ్డగోలుగా దోచుకుంటున్నా.. చర్యలు లేవు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాల వ్యవహారాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి కీలకంగా ఉండటంతో ప్రశ్నించటానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో గుంటూరు, పల్నాడు జిల్లాలో కృష్ణా నది నుంచి తోడి నిల్వచేసిన ఇసుక ధరలకు.. రెక్కలొచ్చాయి. మంగళగిరి నియోజకవర్గంలో డంపింగ్‌యార్డులో టన్ను ఇసుక ప్రభుత్వ ధరల ప్రకారం 605 రూపాయలు, తెనాలిలో 535 రూపాయలుగా ఉంది. పెదకూరపాడులో 565 రూపాయలకు విక్రయించాలి. కానీ 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. రవాణా, ఇతర ఛార్జీలు కలిపి వినియోగదారులకు చేరేసరికి టన్ను ఇసుక వెయ్యి 50రూపాయల నుంచి 1,200 అవుతోంది.

Sand Price In AP: ఇసుక ధరల్లో కనికట్టు.. గనులశాఖ మాయాజాలం..!

డిమాండ్‌ పెరిగేకొద్దీ ఇసుక ధర పెంచుతున్నారు. డంపింగ్ యార్డు వద్ద ఇచ్చే బిల్లులో ఇసుక పరిమాణం మాత్రమే నమోదు చేస్తున్నారుగానీ.. ధర ఎంతనేది పేర్కొనటం లేదు. నదిలో తవ్వకాలు లేకపోవడం, మరో మార్గం లేక చెప్పిన ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసి బయట విక్రయిస్తున్నారు. టన్ను 400 రూపాయలకు పైగా పెరగడంతో వినియోగదారులకు భారంగా మారింది. జేపీ సంస్థ నుంచి తవ్వకాలను తీసుకున్న పల్నాడు జిల్లా నదీతీర ప్రాంత నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి కృష్ణానదిలో ఇసుక తవ్వి రీచ్‌ల సమీపంలో నిల్వచేశారు.

డంపింగ్‌యార్డులో లక్షల టన్నుల ఇసుక పోయటంతో.. కొండలను తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధి నిర్ణయించిన ధర ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమలవుతోంది. ఇసుకకు డిమాండ్‌ను అనుసరించి ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఎక్కువగా వసూలుచేస్తున్నా.. ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం జరుగుతున్నందున అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా కోట్ల రూపాయల సొమ్ము నేత జేబులోకి వెళ్తోంది.

"ఇసుక ధరలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నాయ్.."

ఎవరైనా వాదనకు దిగితే వారికి ఎక్కడా ఇసుక దొరకదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదుచేయడానికి కూడా పోలీసులు వెనుకాడటం లేదు. నదీతీర గ్రామాల ప్రజలు ఇసుక తవ్వకాలపై ప్రశ్నించినందుకు వారిపై కేసులు నమోదుచేశారు. డంపింగ్‌యార్డు వద్ద ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనల ఉల్లంఘన, పర్యావరణానికి తూట్లు, అధికధర వసూలు వంటి అంశాలపై ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు.

నది పక్కనే ఉన్న గ్రామాల వారు ఇసుక తీసుకెళ్లాలన్నా డబ్బులు చెల్లించాల్సిందే. వైకుంఠపురం గ్రామానికి చెందిన ఒకరు ట్రాక్టరులో ఇసుక తీసుకెళ్లగా.. పోలీసులు, అధికారులు 50వేల రూపాయల జరిమానా వేశారు. తీసుకెళ్లిన ఇసుక విలువ రూ.12వేలు కాగా రూ.50వేలు జరిమానా వేయడంతో బెంబేలెత్తిపోయారు. దీంతో ఇసుకరీచ్‌ వైపు వెళ్లడానికి అధికారపార్టీ నేతలు కూడా సాహసించడం లేదు. యంత్రాంగమంతా ప్రజాప్రతినిధి కనుసన్నల్లో నడుచుకుంటుండటంతో.. స్థానికులు నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు.

'ఇసుక ధరలు పెంచి బ్లాక్​లో అమ్ముకుంటున్నారు'

Last Updated : Aug 22, 2023, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.