గుంటూరు జిల్లా కర్లపాలెంలో సాగర్‌రెడ్డి హత్యకు సంబంధించి దోషులను వెంటనే పట్టుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రధాన రహదారిపై మృతుని బంధువులు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ, బాపట్ల డీఎస్పీ శనివారం జరిగిన హత్య కేసు దర్యాప్తు పై ఆరా తీశారు.
త్వరితగతిన కేసు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్టు చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కర్లపాలెంలోని ఘటనా స్థలానికి బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేరుకుని బాధిత కుటుంబాలను తమ నిరసనను విరమించుకోవాలని కోరారు. వీరిని కూడా బాధిత కుటుంబ సభ్యులు చుట్టుముట్టి ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను 24 గంటల్లో పట్టుకుని శిక్షపడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో మృతుని కుటుంబీకులు నిరసనను విరమించారు.
ఇదీ చదవండి: