ఆర్టీసీలో కార్మికుల చార్టుల నిర్వహణలో డిజిటలీకరణ ప్రవేశపెడుతున్నట్లు గుంటూరు జిల్లా ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆర్ ఆదోని తెలిపారు. జిల్లాలోని రేపల్లె బస్ డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రాష్ట్రంలో గుంటూరు డివిజన్ అధిక ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు. రాజధాని జిల్లాలో ఉండటం ప్రత్యేకమన్న సుమంత్... ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలోని 57 మండలాల్లో రహదారి సరిగా లేని సుమారు 35 గ్రామాలు మినహా... అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. నష్టాలు తగ్గించే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. బాలికలకు పదో తరగతి వరకు... బాలురకు 12 ఏళ్ల వయస్సు వరకు ఉచిత బస్‌పాస్‌లు ఇస్తున్నామని చెప్పారు. పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగించి బస్‌పాస్‌లు అందజేయాలని డిపో మేనేజర్లకు సూచించారు.
ఇదీ చదవండి...