ETV Bharat / state

పేరుకే ప్రభుత్వంలో విలీనం - ఉద్యోగుల ప్రయోజనాలను హరించిన వైసీపీ ప్రభుత్వం - ఏపీఎస్​ఆర్టీసీ వేతనల బకాయిలు

RTC Employees Problems in AP: రాష్ట్రంలో అర్టీసీ ఉద్యోగుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. పేరకు మాత్రమే ఆర్టీసీ ప్రభుత్వం వీలినమైనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు మాత్రం అందడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనుంచి ఉన్న ప్రయోజనాలను వైసీపీ తీసేసిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

rtc_employees_problems_in_ap
rtc_employees_problems_in_ap
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 1:18 PM IST

పేరుకే ప్రభుత్వంలో విలీనం ఉద్యోగుల ప్రయోజనాలను హరించిన వైసీపీ ప్రభుత్వం

RTC Employees Problems in AP: ఆర్జిత సెలవులకు డబ్బులు రావడం లేదు సార్‌. వేతన బకాయిలు ఇవ్వడం లేదు సార్. నైట్ అలవెన్సులు ఆపేశారు సార్. పదోన్నతులు ఎప్పుడు సార్‌. ఇలా ఆర్టీసీ కార్మికులు ఎన్ని ప్రశ్నలు అడిగినా వైసీపీ సర్కార్‌ ఒకే ఒక్క డైలాగ్‌ కొడుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం కదా అని దబాయిస్తుంది.

మరి ఎప్పట్నుంచో ఉన్న ప్రయోజనాలు ఎందుకు పీకేశారు సార్ అంటే, విలీనం అని చెప్పాం, చెప్పిందే చేశాం అని దీర్ఘాలు తీస్తోంది. జగన్‌ మార్క్‌ విలీనానికి ఆర్టీసీ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. ఇంతకీ ఆర్టీసీ విలీనం ఉద్యోగుల ప్రయోజనానికా. జగనన్న ప్రచారానికా.

ప్రభుత్వ ఉద్యోగులు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ, ఎంత మూల్యానికి. ఆర్టీసీ ఉద్యోగులకు అంతుచిక్కని ప్రశ్న ఇదే. ఇక మీరంతా ప్రభుత్వ ఉద్యోగులేనంటూ ఆర్టీసీ కార్మికులకు, వైసీపీ సర్కార్‌ అరచేతిలో స్వర్గాన్ని చూపించింది. కానీ, అది స్వర్గం కాదని, నరకమని ప్రభుత్వ తీరువల్ల కార్మికులకు జ్ఞానోదయమైంది. ఉత్తర్వుల్లో తప్ప, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తున్న పాపాన పోలేదు. విలీనంతో ఆశించిన పింఛన్‌ ప్రయోజనాలను నాలుగేళ్లవుతున్నా తేల్చలేదు.

పగిలిన అద్దాలు.. చిరిగిన సీట్లు.. అరిగిన టైర్లు.. కదిలితే చిరాకు పెట్టే శబ్దాలు.!

"ఆర్టీసీ ఉద్యోగులు పింఛన్ల కోసం వీలినాన్ని కోరుకున్నారు. ఎస్​ఆర్​బీఎస్​ ద్వారా పింఛన్లు పొందుతున్నారు. ఇప్పుడు ఎస్​ఆర్​బీఎస్​ పోయింది. మేము ఓపీఎస్​లో లేము, సీపీఎస్​లో లేము." -రమణారెడ్డి, ఆర్టీసీ ఎన్‌ఎంయూ అధ్యక్షుడు

"ఆర్టీసీ విలీనం వెనక పెద్ద కుట్ర ఉంది. మీరు సమ్మెలు చేయకూడదు. కరపత్రాలు ఇవ్వకూడదు. నిరసన తెలపకూడదని మా మీదు రాజ్యంగేతరంగా వ్యవహరిస్తున్నారు. మా హక్కులను మేము అడగకూడదా. ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమైన చర్య." - అయ్యపురెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి

ఆర్టీసీ ఉద్యోగులకు కొరవడిన ఆరోగ్య భద్రత - అప్పుడు అలా, ఇప్పుడు ఇలా!

ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్​లో: ప్రభుత్వంలో విలీనం కాకముందు ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం 2017లో వేతన సవరణ చేసింది. దీని ప్రకారం 2017 ఏప్రిల్‌ నుంచి 2019 ఫిబ్రవరి వరకు 22 నెలలకు చెందిన వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సి ఉంది. 50 వేల మంది ఉద్యోగులకు మొత్తంగా 700 కోట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో వచ్చే జనవరి నుంచి ఏయే నెలల్లో ఎవరెవరు ముందుగా పదవీ విరమణ చేయనున్నారో వారికే చెల్లింపులు చేశారు. 150 కోట్ల రూపాయలు ఇచ్చి, 550 కోట్ల బకాయిలు అలాగే మిగిలిపోయాయి. అవి అడిగే హక్కు లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఆర్టీసీ రాబడిలో ప్రతినెలా 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. సగటున నెలకు 500 కోట్ల రాబడి ఉంటే, అందులో 125 కోట్ల రూపాయలు ప్రతినెలా ప్రభుత్వ ఖజానాకు పోతోంది. 4 నెలలపాటు ప్రభుత్వం ఈ వాటా తీసుకోకపోతే పీఆర్సీ బకాయిలు చెల్లించవచ్చు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించకుండా, ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. 2020 నుంచి 2023 సంవత్సరాల వరకు 60 రోజుల సెలవులను వినియోగించుకోని ఉద్యోగులు ఎన్‌క్యాష్‌మెంట్‌కు పెట్టుకున్నారు. వాటికే 350 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. ఆర్టీసీలో ఉండగా అపరిమిత ఖర్చుతో ఉచిత వైద్య సదుపాయం ఉండేది. విలీనం తర్వాత దాన్ని ఎత్తేసి ఈహెచ్​ఎస్​ కార్డులిచ్చారు. ఇవి పనిచేయక ఉద్యోగులు, కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నారు.

పీఆర్​సీ, సీసీఎస్​ బకాయిలకు మోక్షం ఎప్పుడు..?

ప్రోత్సాహకాలకు పాతర: ఆర్టీసీ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలుండేవి. అధిక రాబడి, మైలేజ్‌ వచ్చేలా చేసినా డ్రైవర్లు, కండక్టర్లు, మెయింటనెన్స్‌ ఉద్యోగులకు గతంలో ప్రోత్సహకాలు చెల్లించేవారు. 2022 ఏప్రిల్‌లో వైసీపీ సర్కార్‌ బస్‌ ఛార్జీలు పెంచినప్పటి నుంచి ప్రోత్సహకాలకు పాతరేశారు.

ఇక సీఎం పర్యటన ఉంటే ఆర్టీసీ బస్సులు సభలకు తరలిస్తున్నారు. వాటికి కండక్టర్లు అవసరం లేదంటూ వారికి బలవంతపు సెలవులిస్తున్నారు. దీనికితోడు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన 2022 ఏప్రిల్‌ నుంచి పదోన్నతులు ఆపేశారు.

పీఆర్సీ సమస్యలు పరిష్కరించాలంటూ, ఆర్టీసీ ఎండీకి జేఏసీ లేఖ

వైసీపీ హయాంలో సిక్ ​లీవ్​లకు జబ్బు చేసింది: విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా సిక్‌ లీవ్‌లు పొందడమే కష్టంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సిక్‌ లీవ్‌ తీసుకుంటే దానికి ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గానీ, ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసే ఎంబీబీఎస్‌ వైద్యుడి ధ్రువీకరణ పత్రంగానీ ఇస్తే సరిపోతుంది. కానీ, ఇప్పుడు ఆర్టీసీల సిక్​లీవ్‌కి జీతం ఇవ్వాలా, వద్దా. అనేది డిపో మేనేజర్‌ నిర్ణయంపై ఆధారపడేలా నిబంధన అమలు చేస్తున్నారు. అంటే డీఎం దయతలిస్తే జీతం, లేదంటే కోతే.

ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు పిల్లల సంరక్షణ సెలవు కింద 180 రోజులు లీవ్‌ తీసుకోవచ్చు. ఆర్టీసీలో విలీనమైనందున మహిళా కండక్టర్లకూ ఈ సెలవులు వర్తిస్తాయని ఆదేశాలైతే ఇచ్చారు. అమలే మరిచారు. అదేమంటే ఏవేవో సాకులు చెప్తున్నారు.

పెనం మీద నుంచి జారీ పొయ్యిలో పడినట్లుగా: ఆర్టీసీ ఉద్యోగులకు గతేడాది సెప్టెంబరు నుంచి 11వ వేతన సవరణ అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి డే ఔట్, నైట్‌ ఔట్‌ సహా అనేక భత్యాలు నిలిపేశారు. రాష్ట్రమంతటా రాత్రివేళ నిత్యం 3 వేల బస్సులు నైట్‌ ఔట్‌గా వెళ్తాయి. వీటిలో విధులకు వెళ్లే సిబ్బందికి రాత్రి భత్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకూ దానిపై స్పష్టత లేదు. మొత్తంగా విలీనంతో అదనంగా దక్కిందేమీలేకపోగా మరింత నష్టపోయామని, నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఆర్టీసీలో ఉన్నపుడే బాగుండేదని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు.

అధిక పింఛన్ అమలయ్యేలా చర్యలు తీసుకోండి మహాప్రభో: ఆర్టీసీ ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.