ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా బుడంపాడు - నారాకోడూరు గ్రామం మధ్య జరిగింది. గుంటూరు నుంచి చీరాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. చేబ్రోలు వైపు నుంచి గుంటూరుకి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి...: గుడిసెకు నిప్పంటుకుని వృద్ధ దంపతులు సజీవ దహనం