పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల రాష్ట్రంపై రూ.1,600 కోట్ల భారం పడనుందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అయినవారికే ప్రభుత్వం టెండర్లను అప్పగిస్తోందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌లో ఒకే సంస్థ టెండర్ వేసిందంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. జీవో 67 నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు పనులు కట్టబెడుతున్నారని వివరించారు. ఏ విశ్వసనీయతతో మేఘా సంస్థకు టెండరు కట్టబెడుతున్నారని నిలదీశారు. ప్రభుత్వంపై విశ్వసనీయత లేకనే ఒకే సంస్థ టెండరు వేసిందని విమర్శించారు. నవయుగ సంస్థ పోలవరం ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా దానిని తొలగించారని అన్నారు. ఇప్పుడు మేఘా సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించటం వల్ల మరో ఏడాది జాప్యం జరుగుతుందని దీనివల్ల రూ.300 కోట్ల భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. వీటితో పాటు విద్యుత్ ప్రాజెక్టు ఆలస్యంతో మరో రూ.1000 కోట్ల భారం పడుతుందిని వివరించారు. ప్రభుత్వ చర్యలకు గోదావరి జిల్లాల భద్రతను పణంగా పెడుతున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.
ఇవీ చూడండి
పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ఇంజినీర్లు పర్యవేక్షిస్తారా?: దేవినేని