గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తి పండుగకు అత్తవారింటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన పాత నేరస్థుడు కొర్రపాటి వీరనాగరాజు.. దినేష్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆ ఇంట్లోకిి ప్రవేశించిన వీరనాగరాజు.. 688 గ్రాముల బంగారాన్ని అపహరించాడు.
ఇంటికి తిరిగి వచ్చిన దినేష్.. తన ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐటీ కోర్ టీం సహాయంతో కలిసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి సంబంధించిన ఆధారాలు సేకరించి, చోరీ కేసును ఛేదించినట్టు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.
అయితే.. ఈ లోగా దొంగిలించిన సొత్తును అమ్మేందుకు పలుచోట్ల ప్రయత్నించాడు నిందితుడు. కానీ.. విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రధాన నిందితుడు వీరనాగరాజుతోపాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 688 గ్రాముల బంగారు అభరణాను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: