గుంటూరు జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కల్వర్టులు అధ్వానస్థితికి చేరుకున్నాయి. జిల్లావ్యాప్తంగా రోడ్డు, భవనాల శాఖ పరిధిలో 407 కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతుకు గురయ్యాయి.
21 చోట్ల కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి మరమ్మతు చేయడానికి 23.57 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రధానంగా తెనాలి డివిజన్లో రోడ్లు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. చక్రాయపాలెం నుంచి కొల్లిపర రహదారి అత్యంత దారుణంగా తయారైంది.
రెండేళ్ల నుంచి నిర్వహణ లేకపోవడంతో రోడ్డు చిధ్రమయ్యాయి. ద్విచక్రవాహనదారులు రాత్రివేళ ప్రయాణించే సమయంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నాళ్లుగా రహదారులు మరమత్తులకు నిధులు విడుదల లేకపోవడంతో నిర్వహణ లోపించింది. ఎక్కువ మంది రాకపోకలు సాగించే ప్రధాన రోడ్డు సైతం గోతులతో స్వాగతం పలుకుతున్నాయి.
ఇదీ చదవండి