గుంటూరు జిల్లా తెనాలిలో చిన్నపాటి వర్షానికే వీధులన్నీ జలమయం అవుతున్నాయి. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో..రోజుల తరబడి రోడ్లపైనే నీరు నిల్వ ఉంటోంది. గంగానమ్మపేట, గాంధీనగర్, మున్సిపాలిటీ కాంప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరీ దారుణంగా.. మోకాళ్ల లోతులో నీరు నిల్వ ఉంటోంది. గంగానమ్మ గుడి చుట్టూ నీరు చేరడంతో.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. రోడ్లన్నీ నీటిలో మునిగిపోవడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక.. చాలా మంది వాహనదారులు కింద పడిపోతున్నారు. నీరు నిల్వ ఉండిపోతుండడంతో.. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వస్తున్నాయని.. డ్రైనేజీలు త్వరగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిధిలో పీవీ సింధు సందడి