గుంటూరు జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను పాటించాలని ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గుంటూరులో పోలీసు శాఖ, రవాణా శాఖ... విద్యార్థులతో కలిసి నగరంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు హిందూ కళాశాల కూడలి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనదారుడు నడుచుకోవాలని వారు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించటానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి నిదానమే ప్రధానంగా ప్రయాణం సాగించాలని సూచించారు.
ఇదీ చదవండి: