ETV Bharat / state

గుంటూరు జిల్లాలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ...ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా కాకుమాను వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 3, 2020, 11:04 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పెదనందిపాడుకు చెందిన కాకుమాను మణికంఠ (19), షేక్ సమీర్, కాలీషాలు కొండపాటూరు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో అప్పాపురానికి చెందిన మనోజ్, జోషీలు మరో వాహనంపై వస్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పెదనందిపాడుకు చెందిన మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా...అప్పాపురం గ్రామానికి చెందిన మనోజ్ ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు జోషిని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. పెదనందిపాడుకు చెందిన మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్ పై అంబులెన్స్ వరకు తరలింపు....
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్, జోషిని కాకుమానులోని అంబులెన్స్ వరకు స్థానికులు బైక్​పై తరలించారు. అంబులెన్స్​లో డ్రైవర్ మాత్రమే ఉండగా.. ఆయనను క్షతగాత్రులను బాపట్ల ఆసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి

నాట్కో కాన్సర్ సెంటర్​లో.. అందుబాటులోకి మెడికల్ లీనియర్ యాక్సిలరేటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.