గుంటూరు జిల్లా వేమూరు మార్కెట్ యార్డ్ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తూ.... ట్రాక్టర్ బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. వారికి తెనాలి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరు మహిళలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి కన్నబాబు... క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం జరగడానికి కారణాలను ఆరా తీశారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇదీచదవండి.