గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కొవిడ్ బారినపడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఆదివారం మహమ్మారి కారణంగా.. చికిత్స పొందుతూ ముగ్గురు వ్యాపారులతో పాటు మరో పూజారి మృతి చెందారు. సోమవారం యడ్లపాడు మండలం సొలస గ్రామంలో ఒక యువకుడు, ఉన్నావ్ గ్రామంలో మరో వ్యక్తి మృతి చెందారు. అదేవిధంగా నాదెండ్ల మండలం గణపవరంలో ఒక ఆటో డ్రైవర్, సాతులూరు లో మరో ఆటో డ్రైవర్ కొవిడ్‌తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ మృతుల సంఖ్య - గుంటూరు జిల్లా వార్తలు
చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండు రోజుల వ్యవధిలో 8 మంది మృతి చెందడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్ మృతుల సంఖ్య