గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ వీరశంకర్రావు మృతిపై సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ విచారణ జరిపారు. తెనాలి ఆసుపత్రికి వచ్చిన ఆయన మార్చురిలో ఉన్న మృతదేహాన్నిపరిశీలించారు. మృతదేహం పరిస్థితి, వైద్యులు, జైలు అధికారులు, పోలీసుల నుంచి సమాచారం సేకరించారు. ఈ ఘటనపై కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు దినేష్ కుమార్ తెలిపారు. వీరశంకర్రావు మృతిపై ఆయన కుమారుడు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అక్కడి వైద్యులతో శవపరీక్ష జరిపి కారణాలు తెలుసుకుంటామన్నారు. ఆ నివేదిక ఆధారంగా అనుమానాలపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామన్నారు. ఓ మహిళ హత్య కేసులో నిందితునిగా ఉన్న వీరశంకర్రావు బుధవారం మరణించారు.
ఇదీ చదవండి : నరసాపురం వ్యవహారంపై సీఎం సీరియస్: ఉమ్మారెడ్డి