ETV Bharat / state

Cyanide Murder: 'సాధారణ మృతి అనుకుంటే.. సైనేడ్ మర్డర్​ అని తేలింది' - Recovery of a body buried in Kambhapadu, Guntur district

గుంటూరు జిల్లా కంభంపాడులో పూడ్చిన మృతదేహం వెలికితీత

author img

By

Published : Sep 25, 2021, 8:39 PM IST

Updated : Sep 25, 2021, 10:47 PM IST

20:34 September 25

died body extraction

సాధారణ మరణంగా పూడ్చిన ఓ యువకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి హత్యగా కేసు నమోదు చేసిన ఉదంతం గుంటూరు జిల్లా  కంభంపాడులో జరిగింది. మాచర్ల గ్రామీణ ఎస్సై ఆదిలక్ష్మి కథనం ప్రకారం...మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన కావూరి శశిధర్(32) ఎనిమిదేళ్లుగా హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. లాక్డౌన్ కారణంగా ఇంటివద్దనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న అతనికి ఫేస్​బుక్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జి.సుష్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అదే పరిచయంతో ఆమె కంభంపాడులోని శశిధర్ ఇంటికి వచ్చింది. తనకు బంగారు ఆభరణాల వ్యాపారం తెలుసని.. వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయని ప్రలోభ పెట్టింది. దీంతో శశిధర్ ఆమెకి రూ.5లక్షల వరకు డబ్బులు ముట్టజెప్పాడు. 

రోజులు గడుస్తున్నా వ్యాపారం ప్రారంభించక పోవడంతో శశిధర్ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగాడు. అయితే సుష్మ సత్తెనపల్లి వస్తే అక్కడ అగ్రిమెంట్ రాసుకుందామని చెప్పడంతో శశిధర్ అక్కడకు వెళ్ళాడు. అక్కడికి వచ్చిన సుష్మ... అతని పేరుమీద పూజలు చేయించానని చెప్పి ఒక పౌడర్ ప్యాకెట్ ఇచ్చింది. దానిని తాగితే మంచి జరుగుతుందని చెప్పింది. తరువాతి రోజు జూన్ 23వ తేదీ రాత్రి సుష్మ ఇచ్చిన పొడిని నీళ్లలో కలుపుకొని తాగడంతో శశిధర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని మాచర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు తీసుకెళ్లమని వైద్యులు చెప్పారు. గుంటూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. జూన్ 24వ తేదీన శశిధర్ సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

అయితే ఓ కేసులో పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు సుష్మను విచారించగా కంభంపాడు శశిధర్ మృతి విషయం వెలుగు చూసింది. తనకు రావాల్సిన రూ.5లక్షలు తిరిగి ఇవ్వమని అడగడం వల్లే శశిధర్ ను చంపాలనే ఉద్దేశ్యంతో సైనెేడ్ కలిపిన పొడిని ఇచ్చినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. దీనిపై మాచర్ల గ్రామీణ పోలీస్ స్టేషన్​లో శశిధర్ తండ్రి శంకరయ్య ఫిర్యాదు చేశారు.
శశిధర్ మృతదేహానికి పంచనామా...

శశిధర్ తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం కంభంపాడులో  తహశీల్దార్ కేశవ నారాయణ, గ్రామీణ సీఐ భక్త వత్సల రెడ్డి, ఎస్సై ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో శవ పంచనామా నిర్వహించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.

ఇదీ చదవండి:

హైదరాబాద్​లో భారీ వర్షం... అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

Last Updated : Sep 25, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.