గుంటూరు జిల్లా నరసరావుపేటలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగూర్ వలి టాకీస్ వద్ద 50 కిలోలతో కూడిన 45 రేషన్ బియ్యం బస్తాలను మినీ లారీలో తరలిస్తుండగా పట్టుకుని రెండో పట్టణ పీఎస్ కు తరలించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పలపాడు గ్రామం నుంచి బియ్యాన్ని తీసుకువస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి-కన్నబిడ్డపై... తండ్రి అఘాయిత్యం!