గుంటూరు జిల్లా నకరికల్లు అడ్డరోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా డీసీఎం వ్యానులో తరలిస్తున్న 120 క్వింటాళ్ల బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని నరసరావుపేట నుంచి తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. వ్యాను డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..