ప్రజలకు రేషన్ కార్డు వెతలు తీరనున్నాయి. గతంలో రేషన్ కార్డు కావాలంటే కాలాతీతం జరిగేది. అంతే కాకుండా అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. రాష్ట్రా ప్రభుత్వం గంటలో రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లాలో తొలుత పిరంగిపురంలో ప్రయోగించారు. ఇది విజయవంతమైందని. ఇకపై అర్జీదారులకు గంటలో రైస్ కార్డు అందించనున్నారు.
పిరంగిపురానికి చెందిన నాగమణి, అనురాధ, మహంకాళి అనే ముగ్గురు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలుత డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ చేశారు. తర్వాత సచివాలయ గ్రామవాలంటీర్లు పరిశీలించి సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారికి పంపారు. ఆయన చూసి. నేరుగా తహసీల్దార్ సాంబశివరావుకు పంపారు. ఆయన ఆమోదించి తిరిగి పంపారు. అర్జీ దారులకు గంటలో రేషన్ కార్డు అందించారు. ఈ ప్రక్రియ అంతా గంటలో జరిగింది.
ఇదీ చదవండి: స్మార్ట్ వ్యథలు : ఆన్లైన్ విద్యకు అడుగడుగునా కన్నీటి గాథలే!