గుంటూరు రమేష్ ఆసుపత్రిలో నెలల వయసున్న ముగ్గురు చిన్నారులకు గుండెకు సంబంధించి అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందులో భాగంగా టెట్రాలజీ ఆఫ్ పాలెట్ అనే సమస్యతో బాధపడుతున్న... నైజీరియా నుంచి వచ్చిన 15 నెలల చిన్నారికి... కూడా గుండె శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. నెలల వయసు, తక్కువ బరువున్న చిన్నారులకు పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం దిగ్విజయంగా... శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు రమేష్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రాయపాటి మమత చెప్పారు.
ఇప్పటికే తమ ఆసుపత్రి ద్వారా నైజీరియా, పాకిస్థాన్, కాంబోడియా, లిబియా దేశాలకు చెందిన 15 మంది చిన్నారుకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు డాక్టర్ మమత వెల్లడించారు. చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్యులను ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది.
ఇదీ చదవండీ...