గుంటూరు జిల్లా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వృద్ధులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఫోక్సో కేసు నమోదు చేశారు. తెనాలి మండలంలోని పినపాడుకు చెందిన వృద్ధులు అన్వర్(80), అహ్మద్(60).. ఓ బాలికకు మాయమాటలు చెప్పి తమ ఇంటికి రప్పించుకున్నారు. తాతయ్య లాంటి వాళ్లే కదా అని వాళ్ల మాటలు నమ్మి ఇంటికి వెళ్లిన బాలికపై తొలుత అన్వర్.. అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో బాలిక బంధువులు చూసి కాపాడాడు. ఈ ఘటన సోమవారం జరగ్గా.. బాలిక కుటుంబ సభ్యులు ఇవాళ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులైన వృద్ధులపై కేసు నమోదు చేసి పోలీసులు.. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి...