గుంటూరు జిల్లా పెదకాకాని మండల కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను.. రోడ్లు, భవనాల శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో కొన్నేళ్లుగా పలువురు వ్యాపారాలు నిర్వహిస్తుండగా.. సుమారు 70 కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసున్నారు.
గుంటూరు నుంచి నందివెలుగు మీదుగా తెనాలి వెళ్లేందుకు.. ప్రభుత్వం ఇప్పుడు రోడ్డుని విస్తరించే పనులు చేపట్టింది. ఇందులో భాగంగా తొలిదశలో రోడ్డుకి ఇరువైపులా 5 మీటర్ల చొప్పున వ్యాపార సముదాయాలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. గృహాలు నిర్మించుకున్న వారికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించారని.. అవి లబ్ధిదారులకు అందిన వెంటనే గృహాలనూ తొలగిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: