జాతీయోద్యమం అనగానే రాష్ట్రంలో వెంటనే గుర్తొచ్చే ప్రాంతం తెనాలి... క్విట్ ఇండియా ఉద్యమంతో 1942 ఆగస్టు 12న తెనాలి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మహత్మ గాంధీ పిలుపుతో... మన రాష్ట్రంలోని గుంటూరు, తెనాలి పట్టణాల్లో స్వాతంత్య్ర ఉద్యమం... చైతన్యవంతమై ముందుకి సాగుతొన్న రోజులవి. బాపూజీ అరెస్టును ఖండిస్తూ తెనాలి పౌరులు శాంతి యుత మార్గంలో భారీ ప్రదర్శన చేశారు. వేలాది మంది ఉద్యమకారుల నినాదాలు... బ్రిటిష్ వాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పరిస్థితిని గమనించిన అప్పటి గుంటూరు కలెక్టర్... సాయుధ బలగాలను గుంటూరు నుంచి తెనాలికి రప్పించారు. రణరంగ చౌక్ లో గుమిగూడిన నిరసనకారులపై తెల్లదొరలు గుళ్ల వర్షం కురిపించారు. ఈ పోరాటంలో వందలాదిమంది గాయపడ్డారు... ఏడుగురు అమరవీరులయ్యారు. అప్పట్లో తెనాలి ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. టోక్యోలోని రేడియోల్లో ఈ ఉద్యమవార్తను ప్రచారం చేశారు. స్వాతంత్ర్య అనంతరం అమరవీరులు త్యాగాలకు గుర్తుగా 1959 డిసెంబర్ లో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి-"త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు"