గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో... జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెదేపా నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్నికల సిబ్బంది వద్ద ఉన్న జడ్పీటీసీ బ్యాలెట్ పత్రాల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉండటంతో తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారుల తీరును నిరసించారు.
మరోవైపు గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో వైకాపా, తెదేపా నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
ఇదీచదవండి.