ETV Bharat / state

బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం - AP HIGH COURT

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

Public order in High Court to demand payment of dues
బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం
author img

By

Published : Feb 27, 2020, 11:21 PM IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తెదేపా ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మౌలిక వసతుల కల్పన కోసం, నిర్మాణ సామగ్రి బిల్లుల చెల్లింపుల నిమిత్తం 2019 జూన్ 1 తర్వాత వచ్చే నిధుల బదిలీ ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేందుకు పంచాయతీరాజ్ కమిషనర్‌కు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన మెమోను రద్దు చేయాలని కోరారు. మెమోను రద్దు చేయకపోతే మొదట నిర్వహించిన పనులకు చెల్లింపులు సాధ్యంకాదని పేర్కొన్నారు.

2018 - 19లో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు భారీగా జరిగాయన్నారు . సీఎఫ్ఎమ్ఎస్ విధానం ద్వారా చెల్లింపులకు నిధుల బదిలీ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ చెల్లింపులు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ఒకసారి పనులు పూర్తై, నిధుల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాక ఆ చెల్లింపులు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్ తర్వాత వచ్చే నిధుల బదిలీ ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మెమో జారీచేసిందన్నారు.

నిబంధనల ప్రకారం పాత బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫండ్ ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్ ( ఎఫ్టీవో ) లకు చెల్లింపులు జరిపే విధంగా ఆదేశించాలని కోరారు. మూడు విడతల్లో నిర్మాణ సామగ్రి చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 1845 కోట్లు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సిన 461 కోట్లు విడుదల చేయలేదన్నారు. పులివెందుల, పుంగనూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపి బకాయిలన్నీ చెల్లించిందన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు.

ఇదీచదవండి.

ప్రశాంతంగానే ఈశాన్య దిల్లీ- 38కి చేరిన మృతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.