గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గంగమ్మ గుడి వెనక ప్రాంతంలోని రెడ్ జోన్ ను తొలగించాలని స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. కొంతమంది మహిళలు ఆ ప్రాంతంలో బైటాయించారు. తమ డిమాండ్ నెరవేర్చే వరకు ఇంటికి వెళ్ళబోమని ధర్నా చేశారు. కరోనా వచ్చిన వ్యక్తి కోలుకొని ఇంటికి చేరుకున్నా.. రెడ్ జోన్ తీయపోవటం తమపై కక్ష సాధింపు చర్యేనని మహిళలు అన్నారు.
కొత్త కేసులు లేనందువలన ఎందుకు రెడ్ జోన్ తీయటంలేదని ఆశా వర్కర్లు, పోలీసులను నిలదీశారు. ఈ విషయం పై అధికారులకు తెలియజేస్తామని.. అధికారులు వచ్చేవరకు తాము సమాధానం చెప్పలేమని వారు అన్నారు. రెడ్ జోన్ ఉండటం వలన తమ పనులు చేసుకోలేక.. ఇంటి అద్దె ఇల్లు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు.
ఇదీ చదవండి: