ETV Bharat / state

ఆ బస్ స్టేషన్​కెళితే దర్శనమిచ్చేది మందుసీసాలే - గుంటూరు ప్రత్తిపాడు బస్స్ స్టేషన్ సమస్యలు న్యూస్

పేరుకు మాత్రం బస్ స్టేషన్, అయితే ప్రయాణికులు మాత్రం ఎవరూ కనిపించరు. కేవలం మద్యం సీసాలు, గ్లాసులు దర్శనమిస్తాయి. ఎక్కడ చూసినా...అధ్వాన్నమే, బస్సులు సైతం ఆ బస్ స్టేషన్ లోకి రావు. ప్రయాణికులు రహదారిపై నిలుచుని బస్ ఎక్కి వెళ్తున్నారు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది.

ఆ బస్ స్టేషన్​కెళితే.. దర్శనమిచ్చేది మందు సిసాలే

author img

By

Published : Oct 17, 2020, 10:22 AM IST

గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు బస్ స్టేషన్ గుంటూరుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి బయలుదేరిన బస్సు ప్రత్తిపాడు, పెదనందిపాడు మీదుగా ప్రకాశం జిల్లా పర్చూరుకు ప్రయాణిస్తున్నాయి. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రాధాన్యత ఉన్న బస్ స్టేషన్ అధ్వాన్నంగా మారింది. చిన్నపాటి వర్షం కురిస్తే భారీగా నీరు చేరి తటాకంలా మారుతుంది. మురుగు నీరు అక్కడే నిలుస్తుంది. దీంతో బస్ స్టేషన్ లోకి రావాల్సిన ప్రయాణికులు రహదారి పై నిలుచుని బస్ ఎక్కి వెళ్తున్నారు. వానలో సైతం అక్కడే నిలబడి వెళ్ళాల్సి వస్తుంది.

బస్ స్టేషన్ మద్యం బాబులకు నిలయంగా మారింది. ఎక్కడ చూసినా... మద్యం సీసాలు, గ్లాసులు కనిపిస్తాయి. తాగుబోతులు స్టేషన్ ఆవరణలో కూర్చుని మద్యం తాగి సీసాలు అక్కడే పడేస్తున్నారు. స్టేషన్ ఆవరణను బహిర్భూమిగా వినియోగిస్తున్నారు. రాత్రుళ్లు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో మహిళలు బస్ స్టేషన్లోకి అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. బస్ స్టేషన్ లో ఉన్న దుకాణాలను అద్దెకు ఇస్తే ప్రయాణికులు కూడా ధైర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెదనందిపాడులో మరో బస్ స్టేషన్ ఉంది. ఇక్కడికి చిలకలూరిపేట, పొన్నూరు, బాపట్ల, పర్చూరు, గుంటూరు నుంచి బస్సులు వస్తాయి. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బస్ స్టేషన్ చుట్టూ నీరు చేరి అపరిశుభ్రంగా తయారైంది. మరమ్మతులు చేసి...రహదారులు నిర్మించి పరిశుభ్రం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'ఉపేక్షిస్తే ప్రతి ఒక్కరూ న్యాయవ్యవస్థను బెదిరిస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.