ETV Bharat / state

Primary Health Centers Working Condition in AP: రాష్ట్రంలో మహిళల 'ప్రసవ వేదన'.. 24 గంటల సేవలు అంతంతమాత్రమే

Primary Health Centers Working Condition in AP: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటలు ఆసుపత్రులుగా మార్చాం.. వీటిలో ఇద్దరు వైద్యులను నియమించామని జగన్ సర్కార్‌ ప్రచారం చేసుకుంటుంది. నిజానికి.. సహజ సిద్ధ ప్రసవాలూ నిర్వహించలేని దుస్థితిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. PHCలో నెలకు రెండున్నర శాతం మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి.

Primary_Health_Centers_in_AP
Primary_Health_Centers_in_AP
author img

By

Published : Aug 22, 2023, 10:37 AM IST

Primary Health Centers Working Condition in AP: రాష్ట్రంలో మహిళల 'ప్రసవ వేదన'

Primary Health Centers Working Condition in AP: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల ఆసుపత్రులుగా మార్చామని ప్రభుత్వం(YCP Government on PHCs) చెబుతున్నా.. వాటి పనితీరు మాత్రం ప్రశ్నార్ధకంగానే ఉంది. ఇవి మొక్కుబడి వైద్యానికే పరిమితమవుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా వైద్యులను నియమించామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా.. ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. అనవసర రిస్క్ అన్న ఉద్దేశంతో PHCల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు.. ప్రసవాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. చిన్నచిన్న సమస్యలకే కేసులను పెద్దాసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.

ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్​, ఐదు పడకలున్న పీహెచ్​సీల్లోనూ(Primary Health Centers) ప్రసవాలు అతి స్వల్పంగా నమోదవుతున్నాయి. అక్కడ అనువైన వాతావరణాన్ని కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమవుతోంది. దీంతో ఏదో సాకు చెప్పి గర్భిణులను ఇతర ఆసుపత్రులకు పంపుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. గైనిక్, మత్తుమందు, చిన్నపిల్లల వైద్యులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.

"సకాలంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయి.. ఆసుపత్రి ఏర్పాటు చేయండి" కార్మికులు

నిబంధనల ప్రకారం సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. కొన్ని చోట్ల మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండడం లేదు. రాత్రి సమయంలో స్టాఫ్ నర్సులు ఉండాలి. ఫోన్ చేస్తే వైద్యులు ఆసుపత్రికి వచ్చేలా ఉండాలి. కానీ.. చాలాచోట్ల ఈ పరిస్థితి లేదు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని పలు PHCలు, ఇతర ఆసుపత్రుల్లో వైద్యులు ఒక్కపూటకే పరిమితమవుతున్నట్టు తేలింది.

No Deliveries in Primary Health Centers: రాష్ట్రవ్యాప్తంగా 1146 PHCలు ఉన్నాయి. వీటిలో కేవలం 36 వేల 543 ప్రసవాలు నమోదయ్యాయి. అంటే నెలకు సగటున కేవలం 2.67శాతం మాత్రమే నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 6వేల 972 ప్రసవాలు నమోదయ్యాయి. అంటే నెలకు సగటు 2.03 శాతం మాత్రమే రికార్డయ్యాయి. 32.55శాతం అంటే 3వందల 73 PHCల్లో ఒక ప్రసవం కూడా జరగలేదు. 1 నుంచి 5 ప్రసవాలు 59.42 శాతం అంటే 6వందల 81 PHCల్లో జరగ్గా.. 4.10 శాతం అంటే 47 కేంద్రాల్లో పదికి పైగా జరిగాయి. కృష్ణా జిల్లాలో 50కు 35, తిరుపతి జిల్లాలో 58కి 37, గుంటూరు జిల్లాలో 25కు 15 PHCల్లో ఒక ప్రసవం కూడా జరగలేదు.

త్వరగా పీహెచ్​సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..

నెల్లూరు జిల్లా చేజర్ల PHCలో సరైన సౌకర్యాల్లేక సాధారణ ప్రసవాలు జరగడం లేదు. దుత్తలూరు మండలం నర్రవాడ PHCలో ఇద్దరు మహిళా వైద్య అధికారులున్నా.. గత ఐదు నెలల్లో రెండే కాన్పులు జరిగాయి. PHCల పరిధిలోని కేసులను అత్యవసరమని పేర్కొంటూ ఇతర ఆసుపత్రులకు పంపుతున్నపుడు పలువురు గర్భిణీలు అంబులెన్సుల్లోనే ప్రసవిస్తున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలకు పంపిన ఆదేశాల్లో కనీసం ఒక్కో PHCలో 5 చొప్పున ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

PHCs are Not Working Properly in AP: గత నెల 16 నుంచి 31 మధ్య 5వేల 9వందల 97 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 38 శాతం అంటే 2వేల 2వందల 93 సిజేరియన్‌లే. ఏలూరు జిల్లాలో 173కు 121, పశ్చిమగోదావరి జిల్లాలో 341కు 227, గుంటూరులో 151కు 96 సిజేరియన్లు జరిగాయి. కోనసీమ, పల్నాడు, బాపట్ల, NTR, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాలో 61 శాతం నుంచి 54 శాతం మధ్య సిజేరియన్ విధానంలో జరిగాయి. కోనసీమ జిల్లా పి. గన్నవరం P.H.C.లో జరిగిన 20 ప్రసవాల్లో 19 సిజేరియన్లే. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు P.H.C.లో 22కు 20, కోనసీమ జిల్లా కొత్తపేట P.H.C.లో 9కి 8 ప్రసవాలు సిజేరియన్ విధానంలో జరిగాయి.

Rains in AP: వరద నీటిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. సిబ్బంది చూస్తుండగానే...

అనకాపల్లి, పార్వతీపురం, చిత్తూరు, తెనాలి, తణుకు, పాడేరు, హిందూపురం, మదనపల్లె, మార్కాపురం, ప్రొద్దుటూరు, టెక్కలి ఆత్మకూరు జిల్లా ఆసుపత్రుల్లో గైనకాలజిస్టులు ఇద్దరు నుంచి నలుగురు వరకు ఉన్నారు. పాడేరు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రుల్లో మినహా మిగిలిన చోట్ల చిన్నపిల్లల వైద్యులు ఉన్నారు. మత్తుమందు వైద్యు నిపుణులు దాదాపుగా అన్నిచోట్లా ఉన్నారు. కానీ ఆసుపత్రుల్లో జులై 16 నుంచి 31 మధ్య 13 వందల 59 ప్రసవాలు జరిగితే... వాటిలో 586 సిజేరియన్లే ఉన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 11 మధ్య 158 మాతృత్వ మరణాలు నమోదయ్యాయి. వారిలో 37 మంది ప్రసవం కంటే ముందుగా ప్రాణాలు కోల్పోయారు. 121 మంది ప్రసవం జరిగిన 42 రోజుల్లోపు మృతి చెందారు. ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫర్ చేసే సమయంలో 8 మంది చనిపోగా.. ఇళ్ల వద్ద 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

అడవివరం పీహెచ్​సీలో సిబ్బంది నిర్లక్ష్యం... ఆస్పత్రి ఎదుటే ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.