ETV Bharat / state

President Draupadi Murmu Approval : ఏపీ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం - ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు

President Draupadi Murmu Approval : హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నూతన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి పంపింది. కేంద్రం రాష్ట్రపతి ఆమోదానికి పంపగా.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ హైకోర్టులకు ఇద్దరు జడ్జిలు, 15 మంది అదనపు జడ్జిల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసింది.

Draupadi_Murmu_Appoints_Four_Additional_Judges

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2023, 5:43 PM IST

President Draupadi Murmu Approval : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు నలుగురు సీనియర్ న్యాయవాదులను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల నేతృత్వంలోని కొలీజియం.. న్యాయవాదులు హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్‌ పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీం కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

AP High Court New judges: ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

న్యాయమూర్తులుగా రాష్ట్రపతి నియమించిన వారిలో హరినాథ్‌ నూనెపల్లి ఒకరు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాతకోట గ్రామంలో కృష్ణవేణి, బాల వెంకటరెడ్డి దంపతులకు 1972 జనవరి 12న ఈయన జన్మించారు. హైదరాబాద్‌లో 1987లో పదో తరగతి చదివారు. ఏలూరు CRR న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి ఆఫీసులో న్యాయవాద వృత్తిలో మెలకువలు నేర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2001-04 మధ్య అదనపు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, సీనియర్‌ ప్యానల్‌ కౌన్సిల్‌గా, ఈడీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2012లో ఏపీ బార్‌ కౌన్సిల్‌గా ఎన్నికయ్యారు. 2015లో ఎన్‌ఐఏ ప్రత్యేక పీపీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌గా సేవలు అందిస్తున్నారు.

High Court Judgment on SI Exams : అర్హత ఉన్న ప్రతి అభ్యర్థిని అనుమతించాలి.. ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

కిరణ్మయి మండవ.. 1970 జులై 30న జన్మించారు. స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా కూచిపూడి. మొవ్వ మండలం బార్లపూడి గ్రామంలో ప్రాథమిక విద్య, కూచిపూడిలో హైస్కూల్‌ విద్య పూర్తి చేశారు. సికింద్రాబాద్‌లోని వెస్లీ మహిళా కళాశాలలో ఇంటర్‌, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయకళాశాలలో లా చదివారు. 1994 డిసెంబరు 28న బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాది జేవీ ప్రసాద్‌ వద్ద జూనియర్‌గా చేరి వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003లో ఆదాయ పన్ను శాఖ తరఫున హైకోర్టులో జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, తర్వాత సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 14 ఏళ్లపాటు ఆదాయ పన్నుశాఖ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందించారు.

హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సుమతి జగడం 1971 జూన్‌ 28న జన్మించారు. స్వస్థలం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పండువారిపేట గ్రామం. హైదరాబాద్‌లోని హోలీ మేరీ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉస్మానియా వర్సిటీ మహిళా కళాశాలలో బీఏ చదివారు. అదే వర్సిటీ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ మహిళా న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1998 మార్చి 19న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం ఆఫీసులో జూనియర్‌గా చేరి మెలకువలు నేర్చుకున్నారు. 2004-09 వరకు హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. గ్రామపంచాయతీ, జడ్పీ, ఎంపీపీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 2020 జూన్‌ నుంచి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

AP High Court on Bandaru Satyanarayana Petition: హైకోర్టులో బండారు సత్యనారాయణ పిటిషన్‌.. విచారణ నవంబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు

న్యాపతి విజయ్‌ 1974 ఆగస్టు 8న రాజమహేంద్రవరంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1997లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1998లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ ఎం.ఎస్‌. రామచంద్రరావు వద్ద న్యాయవాదిగా చేరి వృత్తిలో మెలకువలు నేర్చుకున్నారు. 2012 నుంచి స్వతంత్ర ప్రాక్టీసు మొదలుపెట్టారు. సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, ట్యాక్స్‌, తదితర సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించారు. హైకోర్టు, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్లో పలు కేసుల్లో వాదనలు వినిపించారు. క్రికెట్‌పై మక్కువతో న్యాయవాదుల తరఫున వివిధ టోర్నమెంట్లలో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.