ETV Bharat / state

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు - guntur latest news

గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 17న జరిగే ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి జేసీ సూచించారు.

teacher mlc election counting  preparations
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సన్నాహాలు
author img

By

Published : Mar 15, 2021, 10:38 PM IST

గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 17న గుంటూరులోని ఏసీ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూపర్​వైజర్లు, అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. డమ్మీ బ్యాలెట్ పేపర్​లో ఓట్ల లెక్కింపు శిక్షణను అందించారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జేసీ సూచించారు. వేగంగా లెక్కింపు పూర్తి చేసేందుకు 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి టేబుల్​కు తహసీల్దార్, ఎంపీడీవో స్థాయి అధికారులు కౌంటింగ్ సూపర్​వైజర్లుగా వ్యవహరిస్తారని జేసీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

నకిలీ స్వస్తిక్​​ గుర్తుతో రిగ్గింగ్​ జరిగింది.. ఎస్పీకి స్వతంత్ర అభ్యర్థి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.