ETV Bharat / state

కంచె తెచ్చిన కష్టం... పురిటి నొప్పులతో మహిళ పోరాటం

author img

By

Published : Apr 26, 2020, 7:50 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో గ్రామంలోకి వాహనాలు రాకుండా ముళ్ల కంచె అడ్డు వేయటం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తోంది. అలాంటి ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అంబులెన్స్​ వచ్చినా వెళ్లే దారిలేక.. ఓ మహిళ అర్ధరాత్రి వేళ పురిటినొప్పులతో అల్లాడిపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మృత్యువుతో పోరాడింది.

Pregnant facing problem due to corona lockdown at puttakota in guntur district

ముళ్ల కంచె తెచ్చిన కష్టం... పురిటి నొప్పులతో మహిళ ఇబ్బందులు

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా గ్రామాల సరిహద్దుల్లో వేస్తున్న ముళ్ల కంచెలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన ఓ మహిళకు అర్ధరాత్రి వేళ పురిటినొప్పులు రాగా.. కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 సిబ్బంది హుటాహుటిన బయలుదేరినా.. సరిహద్దులు మూసేసిన కారణంగా ఊరిలోకి రావటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దారి మళ్లించే ప్రయత్నంలో బురదమట్టిలో వాహనం కూరుకుపోయింది. ఈ లోపు మహిళకు పురిటినొప్పులు ఎక్కువై ఇంట్లోనే బిడ్డకి జన్మనిచ్చింది. మహిళ కుటుంబసభ్యులు స్థానికుల సాయంతో.. ఆటోలో అంబులెన్సు వరకు తల్లీబిడ్డలను చేర్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. సరిహద్దుల వద్ద కంచె వేయటం వల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చార్జింగ్​ దీపాల కాంతుల్లోనే.. 'మాంగల్యం తంతునానేనా'!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.