వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కాన్పుకు వచ్చిన మహిళ మరణించిందని.. మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బుధవారం జరిగిందీ ఘటన. గుర్రాల చావడికి చెందిన జాస్మిన్ను.. రెండో కాన్పు కోసం కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఈ క్రమంలో జాస్మిన్ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మరణించిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.
ఇదీ చదవండి:
యూనిఫాం ధరించలేదని ప్రిన్సిపాల్ మందలింపు: విద్యార్థి ఆత్మహత్య