ETV Bharat / state

ప్రమాదవశాత్తు పడిపోయిన ప్రభ... ఇద్దరు కూలీలకు గాయాలు - kotappakonda news

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం నుంచి కోటప్పకొండకు తరలిస్తున్న ప్రభ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

prabha going for kotappakonda has been felt and two gets injured at guntur
కోటప్పకొండకు వెళ్తున్న ప్రభ పడి ఇద్దరు కూలీలకు గాయాలు
author img

By

Published : Feb 21, 2020, 6:01 AM IST

కోటప్పకొండకు ప్రజలు తరలి వెళ్లే సమయంలో అపశృతి నెలకొంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన ప్రభ... గురువారం మధ్యాహ్నం గ్రామం నుంచి భక్తజన సందోహం మధ్య కోటప్పకొండకు బయలుదేరింది. ప్రభ అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం- కట్టుబడి వారి పాలెం మధ్య ప్రమాదవశాత్తు పడిపోయింది. ట్రాక్టర్​కు సైడు ఇవ్వబోయి ప్రభ చక్రం గుంతలో పడింది. ఒక్కసారిగా ప్రభ ఒరిగిపోయి పక్కనే ఉన్న పొలంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తాడును పట్టుకుని ఉన్న ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కోటప్పకొండకు వెళ్తున్న ప్రభ పడి ఇద్దరు కూలీలకు గాయాలు

ఇదీ చదవండి: కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలను ఎందుకు తయారు చేస్తారు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.