People are Suffering due to Power Cuts under YCP Govt: విద్యుత్ ఛార్జీల బాదుడుకు ముందుండే జగన్ ప్రభుత్వం కోతలు లేని విద్యుత్ సరఫరాలో మాత్రం అట్టడుగున నిలుస్తోంది. భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను చూసి సామాన్య ప్రజలకు చెమటలు పడుతున్నాయి. ఈ అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించడానికే అనే విధంగా ప్రభుత్వం కొత్తగా 'విద్యుత్ కోతల' పథకాన్ని అమల్లోకి తెచ్చింది! రోజు మొత్తం మీద మూడు గంటలు కోతలు విధిస్తున్నారు. అది కూడా రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు కరవైంది.
Power cuts in the name of emergency load relief: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏడేళ్ల కిందటి వరకు విద్యుత్ కోతల బాధలు తెలియని ప్రజలకు.. వైసీపీ ప్రభుత్వం రెండో ఏడాది కూడా కాళరాత్రులే చూపిస్తోంది. అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకి నాలుగైదు గంటలపాటు విద్యుత్ సరఫరా ఆపేయడంతో గ్రామాలు, పట్టణాలు అంధకారంలోకి జారుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో మగ్గిపోతున్న జనానికి.. రాత్రి వేళల్లో కరెంటు కోతలతో ఉక్కపోత భరించలేక జాగారం తప్పడం లేదు. జనరేటర్లు లేని ఆసుపత్రుల్లో రోగులకు వైద్యసేవలందిచడంలో తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.
People Suffer With Power Cut in Villages: అంధకారంలో వేల గ్రామాలు.. విద్యుత్ ఉప కేంద్రాల వద్ద ఆందోళన
240.4 million units of electricity demand in a single day in state: అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట ఎక్కువగా వేసవిలో విద్యుత్ కోతలు విధిస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంలో ఆగస్టు నెల ముగిసినా కోతల బాధలు తప్పడం లేదు. విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా ఆగిపోవడం, రిజర్వాయర్లలో నీరు లేక జల ఉత్పత్తికీ ఆటంకం ఏర్పడటంతో కోతలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో పాటు మార్కెట్‌లో విద్యుత్ దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజున 240.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. అందుబాటులో ఉన్న వనరులు, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్ల తర్వాత కూడా ఇంకా 4.49 ఎంయూల లోటు ఉంది. దాన్ని సర్దుబాటు చేయడానికి గ్రామాలు, పట్టణాల్లో ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
Famers Protest For Current on Road : ఎండుతున్న పంటలు.. మండుతున్న రైతులు.. విద్యుత్ కోతలపై కన్నెర్ర
థర్మల్ విద్యుత్ 103.68 ఎంయూలు, జల విద్యుత్ 9.61 ఎంయూలు, పవన విద్యుత్ 11.95 ఎంయూలు, సౌర విద్యుత్ 11.35 ఎంయూలు, వేరే వనరుల నుంచి 2.71 ఎంయూల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల ద్వారా 44.38 ఎంయూల విద్యుత్ అందింది. ఇది పోగా డిస్కంలు 50.47 ఎంయూలను బహిరంగ మార్కెట్ నుంచి కొన్నాయి. అందులో కూడా అత్యవసర పరిస్థితుల్లో లోడ్ రిలీఫ్ కోసం రియల్‌టైం మార్కెట్‌లో కేవలం 5.84 ఎంయూలను మాత్రమే కొన్నాయి. ఫలితంగా కోతలతో జనం అవస్థలు పడుతున్నారు.
Protests across the state against power cuts..
- NTR District.. విద్యుత్ కోతలను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని అనుమంచిపల్లిలో గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాత్రుల సమయంలో విద్యుత్ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.
- Palnadu District.. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ.. ప్రకాశం జిల్లా తుమ్మలచెరువు గ్రామస్థులు 150 మంది సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. వారం రోజుల నుంచి సాయంత్రం 5 గంటలకు కరెంటు తీసేసి అర్ధరాత్రి ఎప్పుడో ఇస్తున్నారంటూ ధర్నాకు దిగారు.
- Prakasam District.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో రాత్రి 7 గంటల నుంచి, కారంపూడిలో రాత్రి 8 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు గంటలు అంతరాయం ఉంటుందని అధికారులు చెప్పారు.
- Bapatla District.. బాపట్ల జిల్లా నగరం, చెరుకుపల్లి, రేపల్లె, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో రెండు రోజులుగా ఎడాపెడా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో చెరుకుపల్లి మండలం కావూరు సబ్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై ప్రజలు నిరసనకు దిగారు. ప్రజలు చిలువూరు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
- YSR District.. వైయస్‌ఆర్ జిల్లా సింహాద్రిపురం, కమలాపురం, పెద్దముడియం, కలశపాడు, కాశినాయన, వీరపునాయునిపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో రాత్రి 8.30 నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
- Vizianagaram.. విజయనగరంలో బుధవారం అర్ధరాత్రి 12 నుంచి గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఉక్కపోత భరించలేక రోడ్లమీదకు వచ్చారు.
- Kurnool District.. విద్యుత్తు కోతలకు నిరసనగా గురువారం రాత్రి 9 గంటలకు కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లులో గ్రామస్థులు సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టారు.