ETV Bharat / state

పౌల్ట్రీ రంగంలో ఒకరికి నష్టం... మరొకరికి లాభం - గుంటూరు జిల్లా కోళ్ల ఫారం తాజా వార్తలు

తొలుత కరోనా భయం... తర్వాత లాక్​డౌన్​ ప్రభావం పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది. ఓవైపు చుక్కలు తాకుతున్న చికెన్ ధరలు... మరోవైపు సగానికి పైగా ఖాళీ అయిన పౌల్ట్రీ ఫారాలు ఎన్నడూ లేని సరికొత్త పరిస్థితిని కల్పించాయి. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిణామం కొందరు వ్యాపారులకు ఉపశమనం ఇవ్వగా... భయంతో ముందే కోళ్లపారాలు ఖాళీచేసిన యజమానులు మాత్రం నష్టాలతో నిట్టూరుస్తున్నారు.

పౌల్ట్రీ రంగంలో ఒకరికి నష్టం... మరొకరికి లాభం

author img

By

Published : Jun 15, 2020, 11:29 AM IST

పౌల్ట్రీ రంగంలో ఒకరికి నష్టం... మరొకరికి లాభం

కరోనా వ్యాప్తి భయం వల్ల ఫిబ్రవరి, మార్చి మాసాల్లో చికెన్​ ధరలు పడిపోయాయి. మొదట్లో కోడి మాంసం తింటే కరోనా వస్తుందని కొందరు చేసిన తప్పుడు ప్రచారాలు పౌల్ట్రీ రంగాన్ని అమాంతం ముంచేశాయి. ఫలితంగా కోళ్ల పరిశ్రమకు అవసరమైన దాణా రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి.

గుంటూరు జిల్లాలో పలుచోట్ల కిలో రూ.20 నుంచి రూ.30లకే చికెన్​ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్నిచోట్ల ఉచితంగా పంపిణీ చేసిన ఉదంతాలున్నాయి. దానికి తోడు లాక్​డౌన్ కారణంగా​ చికెన్ అమ్మకాలు తీవ్రంగా పడిపోయాయి. ఫలితంగా 60 శాతం కోళ్లఫారాలు ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. తర్వాత కరోనా వ్యాప్తి ప్రభావం పౌల్ట్రీ రంగంపై లేదని నిపుణులు భరోసా ఇవ్వటంతో ధరలు మళ్లీ పుంజుకున్నాయి.

లాక్​డౌన్​ సడలింపు తెచ్చిన గిరాకీ

లాక్​డౌన్​ ఆంక్షలను మెల్లమెల్లగా సడలించటంతో బ్రాయిలర్ మాంసానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మొన్నటివరకూ కిలో చికెన్​ రూ.300 ధర పలకగా... ప్రస్తుతం రూ.260 వద్ద కొనసాగుతుంది. కోళ్లను ప్రణాళికతో పెంచుకుని ఇప్పుడు విక్రయిస్తున్న కోళ్లఫారాల యజమానులకు, మాంసం విక్రయదారులకు పరిస్థితులు ఆశాజనకంగా మారాయి. దాదాపుగా 30 శాతం మంది తిరిగి కోళ్ల ఫారాలను కొనసాగించి ఉపశమనం పొందగా.... 70 శాతానికిపైగా నష్టాల్లో కూరుకుపోయారు.

ఇంటి బాట పట్టిన కూలీలు

కోళ్ల పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది కూలీలు బతుకుతున్నారు. గుంటూరు జిల్లాకు తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చినవారే ఎక్కువ. కోళ్ల పెంపకం పరిశ్రమ ముందుకు సాగకపోవడం, లాక్​డౌన్​ ప్రభావం కూలీలపైనా తీవ్రంగా పడింది. చేసేందుకు పనులు లేక కూలీలంతా తమ ప్రాంతాలకు తరలిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమకు కూలీల సమస్య ఎదురవుతోందని కోళ్లఫారం నిర్వాహకులు వాపోతున్నారు.

దెబ్బతిన్న ఉత్పత్తులు

మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, బియ్యంనూక తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించేది పౌల్ట్రీ పరిశ్రమే. ఈ పరిశ్రమ దెబ్బతినడం వల్ల పరోక్షంగా ఈ ప్రభావం ఆయా ఉత్పత్తుల మీద కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నేరుగా స్పందించి... నష్టనివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఆమె ట్రాక్టర్​.. బతుకు మడిలోని కష్టాల్ని దున్నేసింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.