కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మదుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టాలుంటాయని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ వైద్యులు స్పష్టం చేశారు. ఒక్కసారి కొవిడ్ సోకి తగ్గిన తర్వాత పిత్తాశయం, మూత్రపిండాలు, తలనొప్పి, పక్షవాతం, కంటిచూపు దెబ్బతింటున్నాయని మణిపాల్ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ సందీప్ తెలిపారు. తాము కొవిడ్ చికిత్స చేసిన 20 మంది రోగులకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. కొవిడ్ చికిత్స సమయంలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వినియోగించడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: