స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో రాజకీయనేతలు, అధికారులను వ్యక్తిగతంగా కలవకూడదని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఎస్ఆర్.శంకరన్ హాలులో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన వర్క్ షాపులో కలెక్టర్ పాల్గొన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు చేపట్టాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉన్నందున్న సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీచదవండి.