ముఖ్యమంత్రి సహాయనిధికి 'మెస్సర్స్ పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్' 10 లక్షల రూపాయల విరాళం అందించింది. గుంటూరులో హోంమంత్రి సుచరితను కలిసిన కంపెనీ యాజమాన్య సభ్యులు.. ఆమెకు చెక్కు అందించారు. వారిని హోంమంత్రి అభినందించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు తమవంతు బాధ్యతగా విరాళం ఇచ్చినట్లు వారు తెలిపారు. కొవిడ్ అంతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సుచరిత కోరారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవీ చదవండి.. 'ఎస్ఈసీ కనగరాజ్‌ను క్వారంటైన్లో ఉంచారా?'