ETV Bharat / state

టిడ్కో గృహ ప్రవేశానికి అఖిలపక్ష నేతల యత్నం... అడ్డుకున్న పోలీసులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల ప్రవేశానికి... లబ్ధిదారులతో అఖిలపక్ష పార్టీలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. లబ్ధిదారులతోపాటు అఖిలపక్ష పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్​కు తరలించారు.

Police thwart the efforts of all party leaders in Chilakaluripeta at guntur
టిడ్కో గృహ సముదాయాల ప్రవేశానికి అఖిలపక్ష నేతలు యత్నం... అడ్డకున్న పోలీసులు
author img

By

Published : Nov 16, 2020, 5:39 PM IST

Updated : Nov 16, 2020, 6:37 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో లబ్ధిదారులకు టిడ్కో గృహాలను పంపిణీ చేయకపోవటంతో... అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. తెదేపా హయాంలో చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల విస్తీర్ణంలో... టిడ్కో ఆధ్వర్యంలో 6512 పీఎంఏవై గృహ నిర్మాణాలను చేపట్టింది. ఆ ఇళ్లను వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవటాన్ని నిరసిస్తూ... ఇళ్లను వారికి స్వాధీనపర్చే కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. పోలీసులు ముందస్తుగా పలు పార్టీల నేతలను గృహ నిర్భంధం చేశారు. అయితే కొందరు అఖిలపక్ష నాయకులు లబ్ధిదారులతో కలసి ఎన్​ఆర్​టీ సెంటర్ నుంచి టిడ్కో ఇళ్ల వరకు ర్యాలీగా బయలుదేరగా...తెదేపా కార్యాలయం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. లబ్ధిదారులు, నాయకులు చిలకలూరిపేట-నరసరావుపేట రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులతో మాట్లాడి... ఇళ్ల స్వాధీనం కార్యక్రమానికి అనుమతి లేదని, నిరసన విరమించాలని సూచించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో స్టేషన్ కు తరలించారు.

ఇదీ చదవండి:

'సీఎం జగన్​ను ప్రశ్నించలేరు కానీ... చంద్రబాబును విమర్శిస్తారా'

Last Updated : Nov 16, 2020, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.