ETV Bharat / state

SPORTS MEET: స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన హోంమంత్రి

author img

By

Published : Dec 28, 2021, 1:58 PM IST

SPORTS MEET: గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో స్పోర్ట్స్ మీట్​ను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. నిత్యం ఒత్తిడిలో ఉండే పోలీసులు ఈ పోటీల ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని చెప్పారు.

స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన హోంమంత్రి
స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన హోంమంత్రి

SPORTS MEET: గుంటూరు పోలీసు పరేడ్ మైదానంలో గ్రామీణ పోలీసుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే క్రీడాపోటీలను హోంమంత్రి మేకతోటి సుచరిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం ఒత్తిడిలో ఉండే అధికారులు, సిబ్బందికి ఇలాంటి పోటీల వల్ల ఎంతో కొంత ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు.

మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా విధులకు వెళ్లాలని ఈ సందర్భంగా హోంమంత్రి కోరారు. అనంతరం క్రీడాపోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తానే స్వయంగా కబడ్డీ పోటీల్లో పాల్గొని సహచరుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఇదీ చదవండి:

'సాంకేతిక ప్రపంచానికి వెలకట్టలేని బహుమతులు ఇచ్చిన ఐఐటీ కాన్పుర్ '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.