POLICE HIGH SECURITY AT CM HOME : వాల్మీకి, బోయ, బెంతు ఒరియా కులాలను ఎస్టీల్లో చేరిస్తే తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. భారీగా బలగాలను సీఎం నివాసం చుట్టూ మోహరించారు.
జగన్ నివాసానికి వెళ్లే మార్గాలైన తాడేపల్లి పశు వైద్యశాల, ఎన్టీఆర్ కట్ట, పాత టోల్‌గేట్ కూడలి, పాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాతూరు రహదారి వద్ద హైకోర్టు ఉద్యోగుల బస్సును పోలీసులు ఆపేశారు. దీంతో ఉద్యోగులు, పోలీసులు మధ్య స్వల్ప వాగ్వాదం చెలరేగింది. రహదారులు మూసేస్తున్నట్లు ముందస్తు సమాచారం లేకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: