Police removed Fencing: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లే జాతీయ రహదారిపై వేసిన ముళ్ల కంచెను పోలీసులు తొలగించారు. దాదాపు రెండు నెలల క్రితం ఉద్యోగులు చలో సీఎం నివాసం పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే అన్ని మార్గాలలో ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ముళ్లకంచెలు వేశారు. అప్పటినుంచి వాటిని తొలగించకుండా అలానే వదిలేశారు. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్లకి వెళ్లే పాదచారులు ముళ్ల కంచె వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటిని తొలగించాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. దీంతో పోలీసులు ముళ్ల కంచెను తొలగించారు.
ఇవీ చదవండి: