గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పేకాట, కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని అయోవ స్కూల్ సమీపంలో పేకాట స్థావరంగా మారిన ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10,400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చాణిక్య హెచ్చరించారు. కోడి పందేలు, పేకాట నిర్వహణ లాంటి ఘటనలపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.
ఇవీ చూడండి: