గుంటూరు విజయపురి కాలనీలో గుట్కా స్థావరాలపై పట్టాభిపురం పోలీసులు దాడి చేశారు. గుట్కా తయారు చేస్తున్న మణికృష్ణ ప్రసాద్, దేవరపల్లి కొటేశ్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ రామారావు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.8 లక్షలు విలువ చేసే గుట్కా తయారీ యంత్రం, 13 గుట్కా బస్తాలు, 50 కేజీల ముడి సరుకు, కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుట్కా స్థావరాలపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. మాదకద్రవ్యాల గురించి స్థానికులకు ఏదైనా సమాచారం తెలిస్తే తక్షణమే తెలియజేయాలని సూచించారు.
ఇదీ చదవండీ: