తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన కేసులో.. యువతిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న జ్యోతిర్మయి అనే యువతి ఆమె స్నేహితుడు మణికంఠతో కలిసి.. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. దీనిపై తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జ్యోతిర్మయితో సహా ఆమెకు సహకరించిన మణికంఠను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
ఇదీ జరిగింది: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతని మర్మంగం కోసిన ఘటన.. సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. బాపట్ల జిల్లాకి చెందిన రామచంద్రారెడ్డి రెండేళ్ల క్రితం తెనాలి వచ్చాడు. అతనికి ఐతానగర్‌కి చెందిన సంధ్య అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కూలీపని చేసుకునే రామచంద్రరెడ్డి లాడ్జిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి సంధ్యతో కలిసి మద్యం సేవించి ఆమె నివాసం ఉండే భవనంపై నిద్రస్తున్నారు. అదే సమయంలో సంధ్య కుమార్తె, మరో యువకుడు భవనంపైకి వచ్చి రామచంద్రారెడ్డితో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో అతని మర్మాంగాన్ని కోసేశారు. బాధితుడి కేకలు విన్న స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు.
ఇదీ చదవండి: తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మంగాలు కోసేసిన కుమార్తె